పశ్చిమ్ బంగలో దుర్గా దేవీ విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగలో ఈ ఘటన జరిగింది.
దేవీ నిమజ్జనంలో అపశ్రుతి- ఐదుగురు మృతి - Murshidabad Durga idol immersion
దుర్గా దేవీ విగ్రహ నిమజ్జనం చేస్తుండగా రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. బంగాల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. రెండు పడవల్లో మొత్తం 20 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
దేవీ నిమజ్జనంలో అపశ్రుతి- ఐదుగురు మృతి
ఐదుగురి మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణించినట్లు చెప్పారు.
మరిన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. విపత్త నిర్వహణ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Oct 27, 2020, 7:40 AM IST