ఐదుగురు ఐటీబీపీ జవాన్లకు కరోనా- 90 మంది క్వారంటైన్
15:55 May 01
ఐదుగురు ఐటీబీపీ జవాన్లకు కరోనా- 90 మంది క్వారంటైన్
ఐటీబీపీ(ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్) దళంలో కరోనా కలకలం రేగింది. ఐదుగురు జవాన్లకు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
బాధితుల్లో ఇద్దరు 50వ బెటాలియన్‌కు చెందిన ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్. వీరు దిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సోకినట్లు తేలిన వెంటనే వీరిని హరియాణా జజ్జర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆ బెటాలియన్‌లోని మొత్తం 90 మందిని ఐసొలేషన్‌లోకి పంపారు.
దిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మరో ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. వీరిని ఐసొలేషన్‌కు పంపారు.