దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ హింసాత్మక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 24కి చేరినట్లు అధికారులు ప్రకటించారు.
బదిలీలు
దిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ హింసాత్మక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 24కి చేరినట్లు అధికారులు ప్రకటించారు.
బదిలీలు
నిరసనలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోహిణి ప్రాంతం అదనపు కమిషనర్ ఎస్డీ మిశ్రాను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. రోహిణి డీసీపీగా పి. మిశ్రాను నియమించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఐజీఐ) డీసీపీ గా ఉన్న ఎస్ భాటియాను సెంట్రల్ దిల్లీకి బదిలీ చేసింది. సెంట్రల్ దిల్లీ అదనపు కమిషనర్ రాంధవాను క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేసింది. కమిషనర్ స్టాఫ్ అధికారి రాజీవ్ రంజన్‌ను ఐజీఐ డీసీపీగా నియమించింది.
కొద్ది రోజులుగా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు హింసాత్మక నిరసనలు చేపట్టారు.