ఆన్లైన్ గేమ్ పబ్జీ నేపథ్యంలో మరో వివాదాస్పద ఘటన బయటకు వచ్చింది. పబ్జీ వల్ల ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం... చివరికి రెండు కుటుంబాల మధ్య హింసకు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమ్లి జిల్లాలో జరిగింది.
లాఠీలు.. తుపాకులు...
హసన్‌పుర్ గ్రామంలో.. అమన్, విశాల్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పబ్జీపై వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇందులో ఇరువురి కుటుంబసభ్యులు కూడా జోక్యం చేసుకున్నారు. చివరికి అది ఘర్షణకు దారి తీసింది. ఇరువైపుల వారు లాఠీలు, తుపాకులతో హింసకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో గాయపడ్డ ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.