తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం సంతకం ఫోర్జరీ.. నిందితుల అరెస్టు - అసోం

అసోం సీఎం సర్బానంద సోనోవాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​, బస్తి ప్రాంతాల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గువాహటికి తరలించారు.

5 held for fraudulently withdrawing money from Assam CM's Relief Fund
సీఎం సంతకం ఫోర్జరీ.. నిందితుల అరెస్టు

By

Published : Sep 1, 2020, 2:25 PM IST

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిధులను కాజేసిన నిందితులను పోలీసు ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌, బస్తి ప్రాంతాల్లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గువాహటికి తరలించారు.

ముఖ్యమంత్రి సహాయనిధిలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సీఎం కార్యాలయ అధికారులు.. విచారణ చేపట్టి నిందితులను 15 రోజుల్లోగా అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్‌ సెల్‌ను ఆదేశించారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెల్‌ పోలీసు సూపరింటెండెంట్ రోసీ కలీత ఆగస్టు 12న కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు అనాధారిత చెక్కుల ద్వారా హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు బ్యాంకుల్లో డబ్బు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు.

గోరఖ్‌పూర్‌తోపాటు బస్తి ప్రాంతాల్లో గాలించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రోసీ వెల్లడించారు. విచారణలో భాగంగా ఈ ముఠా గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని వెల్లడించారు.

ఇదీ చదవండి:సరిహద్దులో పరిస్థితిపై అజిత్ డోభాల్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details