తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5.5 లక్షల మట్టి ప్రమిదలతో 'అయోధ్య దీపోత్సవం'

అయోధ్య నగరం ఈ ఏడాది దీపాల కాంతుల్లో వెలిగిపోనుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం.. ప్రపంచ రికార్డు సాధించనుంది. అందుకోసం మట్టి ప్రమిదలతో 5.5 లక్షల దీపాలు వెలిగించాలని నిర్ణయించింది యోగి ప్రభుత్వం. మరోవైపు.. కరోనా నేపథ్యంలో ప్రజలు వర్చువల్​గా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేపట్టింది.

Deepotsav
అయోధ్య దీపోత్సవం

By

Published : Oct 24, 2020, 12:51 PM IST

అయోధ్యలో నగరంలో ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే దీపోత్సవం.. ఈ ఏడాది సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. అందుకోసం మట్టి ప్రమిదలతో 5.5 లక్షల దీపాలు వెలిగించేందుకు ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి ఆటంకం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులను ఈసారి దీపోత్సవాలకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో.. వర్చువల్​గా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబర్​ 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది.

2017లో ఈ దీపోత్సవాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం. రాష్ట్ర పండుగగా ప్రకటించింది. స్థానికులు, వలంటీర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయోధ్య నగరమంతా.. దీపాలు వెలిగిస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 5 లక్షల దీపాలు వెలిగించారు.

" రామ్​ కథా పార్క్​, రామ్​కీ పైదీ, నయాఘాట్​, సరయు హారతి సహా పలు ప్రాంతాల్లో నవంబర్​ 13న ప్రధాన దీపోత్సవం జరుగుతుంది. రామ్​కథా పార్క్​లో నిర్వహించే కార్యక్రమంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడికి పట్టాభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా హెలికాప్టర్​ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సరయు హారతి, రామ్​లీలా ప్రాంతాల్లో భజన కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి అనుమతించటం లేదు. కొద్ది మందికి మాత్రమే ధ్రువీకరణ పత్రాలు అందించాం. కరోనా నిబంధనలన్నింటినీ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. "

- అనుజ్​ కుమార్​ ఝా, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్​

చారిత్రక 'రామ్​లీలా' నాటకం అయోధ్య నగరంలో వర్చువల్​గా ప్రదర్శితమవుతోంది. ఏటా దసరా పండుగ సందర్భంగా ఈ నాటక ప్రదర్శన చేపడతారు.

ఇదీ చూడండి: 10 కోట్లు దాటిన 'రామ్​లీలా' వీక్షకుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details