తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నమలై పట్టణంలో లారీ- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామికవేత్త శ్రీనాథ్ రెడ్డితో పాటు అతడి భార్య షాలిని, కుమారుడు భరత్, అల్లుడు సందీప్ సహా మొత్తం ఐదుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. వీరందరూ అన్నమలైయర్ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
దేవుడి దర్శనం కోసం వెళ్తూ ఐదుగురు మృతి - CLASH
తమిళనాడులోని తిరువన్నమలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశ్రామికవేత్త శ్రీనాథ్ కుటుంబం మృతిచెందింది. వారి వాహనం ఒక లారీని ఢీకొనగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దేవుడు దర్శనం కోసం వెళ్తు అయిదుగురు మృతి
ఇదీ చూడండి:- ఇన్ఫోసిస్ సుధామూర్తి సింప్లిసిటీ చూశారా?
Last Updated : Sep 26, 2019, 9:19 PM IST