తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో సొంత పార్టీకే ఎమ్మెల్యేల షాక్​ - up rajyasabha elections

ఉత్తర్​ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికలో ​బహుజన్​ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు. పార్టీ సమన్వయ కర్త రామ్​జీ గౌతమ్​ను ప్రతిపాదించిన 10 ఎమ్మెల్యేల్లో ఐదుగురు మద్దతు ఉపసంహరించుకున్నారు. వీరంతా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

BSP
రాజ్యసభ

By

Published : Oct 28, 2020, 3:48 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో సొంత పార్టీకే షాకిచ్చారు బీఎస్​పీ ఎమ్మెల్యేలు. పార్టీ అభ్యర్థిగా రామ్​జీ గౌతమ్​ను ప్రతిపాదించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. నామినేషన్​ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపించినట్లు తెలుస్తోంది.

ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నవంబర్ 9న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం రామ్​జీ నామినేషన్ ​ దాఖలు చేసిన తర్వాత రోజే ఈ నాటకీయ పరిణామాలకు తెరలేసింది. నామినేషన్లకు సంబంధించి బుధవారం (ఇవాళ) స్క్రూటినీ నిర్వహించనున్నారు.

ఇతర పార్టీల మద్దతు ఆశించి..

పార్టీ జాతీయ సమన్వయ కర్త గౌతమ్​ను రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టాలని బీఎస్​పీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం నిర్ణయించారు. తమ అభ్యర్థిని గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా గౌతమ్​ను పోటీలో నిలిపింది బీఎస్​పీ. భాజపాయేతర పార్టీలు మద్దతు లభిస్తుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్​లో ఖాళీ అయిన 10 సీట్లలో 8 అధికార భాజపా దక్కించుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:బిహార్​ బీఎస్పీకి షాక్​.. ఆర్జేడీలోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details