తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు యువకుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా - మాండ్వీ జలపాతం

సెల్ఫీ సరదా ఐదుగురు యువకుల ప్రాణాలు తీసింది. మహారాష్ట్ర పాల్​ఘర్​ జిల్లాలోని కాల్​ మాండవి జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు యువకులు నీటిలో పడిపోయారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు కూడా నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

waterfall
పాల్​ఘర్

By

Published : Jul 3, 2020, 8:44 AM IST

మహారాష్ట్ర పాల్​ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. జవహార్​ సమీపంలోని కాల్​ మాండవి జలపాతంలో పడి ఐదుగురు యువకులు మరణించారు. ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ తీసుకునేటప్పుడు నీటిలో పడిపోగా వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు.

కాల్​ మాండవి జలపాతం

వీరిని జవహార్​ పట్టణంలోని అంబికా చౌక్​కు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాల సాయంతో మృతదేహాలను వెలికితీసి జవహార్ ఆసుపత్రికి తరలించారు.

"ఘటన జరిగిన సమయంలో బాధితులు మద్యం సేవించారా అన్న విషయంలో ఆరా తీస్తున్నాం. వైద్య నివేదక తర్వాత దీనిపై నిర్ధరణకు వస్తాం. చనిపోయిన వాళ్లు మంచి ఈతగాళ్లేనని తెలుస్తోంది. అయితే నీటి ప్రవాహంతో పాటు లోతు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మునిగిపోయారని భావిస్తున్నాం."

- అప్పాసాహిబ్, దర్యాప్తు అధికారి

ఏం జరిగింది?

జవహార్​కు చెందిన 13 మంది యువకులు గురువారం మధ్యాహ్నం.. ఈత కొట్టేందుకు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలోని మాండవి జలపాతానికి వెళ్లారు. ఈత కొట్టిన తర్వాత ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుండగా లోతైన ప్రదేశంలో పడిపోయారు. వారిని రక్షించేందుకు మరో ముగ్గురు వెళ్లారు. ఐదుగురి ఆచూకీ లభించకపోవటం వల్ల మిగిలిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన జరిగిన ప్రదేశం

కాల్​ మాండవిలో వరుసగా మూడు జలపాతాలు ఉన్నాయి. ఇక్కడ కనీసం 100 అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడ ఏడాదంతా నీరు ప్రవహించినా.. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.

ఇదీ చూడండి:పిడుగుపాటు ఘటనల్లో ఒక్క రోజే 31 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details