తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఐదుగురిని ఎత్తుకెళ్లి 'స్వర్గం' చూపించిన చైనా! - Kibithu Damai

భారత సరిహద్దుల వెంట ఉన్న అడవుల్లో అపహరణకు గురైన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులను చైనా ఇటీవల విడుదల చేసింది. అయితే అరుణాచల్​ ప్రదేశ్​ సుబన్‌సిరి జిల్లాలో వారిని అపహరించిన చైనా సైన్యం అక్కడి నుంచి 1000 కిమీ దూరంలో ఉన్న కిభిథు- దమాయి సరిహద్దు వద్ద భారత్​కు అప్పగించింది. వారిని చైనా 'స్విట్జర్​ ల్యాండ్'​గా పిలిచే అద్భుత ప్రదేశాల గుండా తీసుకొచ్చినట్లు సమాచారం.

PLA travelled across China's 'Switzerland'
చైనా 'స్విట్జర్​ ల్యాండ్​'లో భారతీయుల సాహసయాత్ర

By

Published : Sep 15, 2020, 3:54 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​కు చెందిన ఐదుగురు యువకులను సెప్టెంబర్​ 2న అపహరించిన చైనా సైన్యం వారికి జీవితంలో మర్చిపోలేని ప్రదేశాల్ని చుపించినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే సుందర ప్రదేశాలు తిప్పి వారిని భారత్​కు అప్పగించారు చైనా సైనికులు.

సెప్టెంబర్​ 12న భారత్​-చైనా-మయన్మార్​ ట్రై జంక్షన్​కు దగ్గర్లో ఉన్న కిబిథు- దమాయి సరిహద్దు వద్ద ఆ ఐదుగురు యువకులను చైనా సైన్యం భారత జవాన్లకు అప్పగించింది. అయితే వారిని అపహరించిన ప్రదేశం నుంచి ఇది దాదాపు 1000 కిమీ దూరంలో ఉంది.

"ఆ ఐదుగురు యువకుల్ని చైనా సైనికులు అపహరించిన ప్రదేశం దిమాపుర్ పరిధిలోని 3 కార్ప్స్​లోకి వస్తుంది. పీఎల్​ఏ సైనికులు, 3 కార్ప్స్ అధికారులు చర్చల కోసం​ కలిసే నిర్దేశిత ప్రదేశం కిబిథు సరిహద్దు. కనుక వారిని అక్కడే అప్పగించారు."

- సీనియర్​ సైనికాధికారి

దమాయి పీఎల్​ఏకు చెందిన సైనిక స్థావరం. ఇది చైనా భూభాగంలో ఉంది. అంజో జిల్లాలో ఉన్న కిబిథు స్థావరం భారత్​కు చెందినది. ఈ రెండూ 2.5 కిమీ దూరంలోనే ఉంటాయి.

అత్యంత సుందరం...

ఆ ఐదుగురు యువకుల్ని ఈ సరిహద్దు వద్ద అప్పగించడం వల్ల వారు చైనా 'స్విట్జర్​ల్యాండ్'​గా పిలిచే అత్యంత సుందరమైన ప్రాంతాలను చూడగలిగారు. ఎత్తైన కొండలు, లోయలు, పర్వతాల మధ్య నదులు, ఎక్కడ చూసినా హరితమయంగా కనిపించే ప్రదేశాల గుండా వారిని తీసుకువచ్చారు చైనా సైనికులు.

వారి జీవితంలో ఇలాంటి ప్రయాణాన్ని వారు ఎన్నడూ చేసి ఉండరు. అయితే వారితో చైనా సైన్యం కఠినంగానే వ్యవహరించి ఉండొచ్చు.

కిబిథుకు చేరుకున్న యువకులు కరోనా నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉన్నారు. అయితే వారి సాహసయాత్ర గురించి భారత సైన్యం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఎక్కడ దాచారు?

ఐదుగురు యువకులను 52,53 పీఎల్ఏ పర్వత పదాతిదళాలకు చెందిన న్యింగ్​చి స్థావరం వద్ద చైనా సైన్యం దాచి ఉంచినట్లు సమాచారం. ఇది వారిని అపహరించిన ప్రదేశానికి ఎంతో దూరంలో లేదు.

అపహరణ...

అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతానికి కస్తూరి జింకల కోసం వెళ్లిన కొందరు దారి తప్పిపోయారు. సరిహద్దుల వెంట వారిని చైనా సైన్యం అపహరించింది. వారు కనిపించకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భారత సైన్యాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై సంప్రదించగా.. చైనా భద్రతాదళం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తొలుత తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరించింది. అనంతరం వారు తమ అధీనంలోనే ఉన్నట్టు ప్రకటించింది.

(రచయిత -సంజీవ్​ కుమార్​ బారువా, సీనియర్ పాత్రికేయుడు)

ABOUT THE AUTHOR

...view details