బెంగళూరులోని పాద్రాయణపురలో వైద్య సిబ్బందిపై దాడి కేసు నిందితుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. వారిని ఆసుపత్రికి తరలించి అందిస్తున్నారు.
మరో 121 మందిపై ప్రత్యేక దృష్టి
బెంగళూరులోని పాద్రాయణపురలో వైద్య సిబ్బందిపై దాడి కేసు నిందితుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. వారిని ఆసుపత్రికి తరలించి అందిస్తున్నారు.
మరో 121 మందిపై ప్రత్యేక దృష్టి
ఇటీవల కొందరిని క్వారంటైన్ చేసేందుకు పాద్రాయణపురకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడికి సంబంధించి 126 మందిని అరెస్టు చేశారు అధికారులు. వారందరినీ రామనగర సమీపంలోని జైలుకు తరలించారు. గురువారం రిమాండ్‌లో ఉన్న ఇద్దరికి వైరస్ సోకినట్లు తేలగా.. మరో ముగ్గురికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
రామనగర ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసైనా నమోదు కాలేదు. అలాంటి చోట వైరస్ సోకిన వారితో సంబంధమున్న వారిని ఉంచడంపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభ్యంతరం తెలిపారు. వారందరినీ మరొక చోటకు తరలించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. మిగిలిన 121 మందిని హజ్ భవన్లో నిర్బంధంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.