ఒడిశాలోని 49 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వీరందరూ అంపన్ తుపాను నేపథ్యంలో బంగాల్లో విధులు నిర్వర్తించి ఇటీవలే ఒడిశాకు వచ్చారు. వీరు కటక్‌లోని ముండాలి ప్రాంతానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ 3వ బెటాలియన్ సభ్యులని తెలుస్తోంది.
ఆ 49మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా - NDRF Odishas Cuttack corona
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఒడిశాలోని 49మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. అంపన్ తుపాను నేపథ్యంలో వీరందరు బంగాల్లో సహాయక చర్యలు చేపట్టి ఇటీవలే ఒడిశాకు తిరిగివచ్చారు.
![ఆ 49మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా 49 personnel of NDRF tested Covid-19 +ve in Odishas Cuttack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7538167-641-7538167-1591679176529.jpg)
ఆ 49మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా
అంపన్ తుపాను నేపథ్యంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి బంగాల్ వెళ్లిన 173 సభ్యుల బృందంలో ఈ 49మంది జవాన్లు ఉన్నారు. ఈ నెల 3న వీరు ఒడిశాకు తిరిగొచ్చారు.
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు.