పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనల్లో ధ్వంసమైన ఆస్తులకు సంబంధించిన నష్టపరిహారం.. బాధ్యుల నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది యూపీ సర్కార్. ఈ నేపథ్యంలో ఒక్క ముజఫర్‌నగర్ జిల్లాలోనే 46 మందికి నోటీసులు జారీచేసింది. డిసెంబరు 20న జరిగిన అల్లర్లలో వారికి ప్రమేయం ఉందని ముజఫర్‌నగర్ జిల్లా పాలనాధికారి తెలిపారు. జనవరి 9లోపు సమాధానమివ్వాలని 46 మందిని ఆదేశించినట్లు చెప్పారు.
పౌర ఎఫెక్ట్: 46 మందికి యూపీ సర్కార్ నోటీసులు
పౌర నిరసనల్లో ధ్వంసమైన ఆస్తులకు సంబంధించిన నష్టపరిహారంపై కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. నష్టపరిహారాన్ని బాధ్యుల నుంచే రాబట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్క ముజఫర్‌నగర్ జిల్లాలోనే 46 మందికి నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పౌర ఎఫెక్ట్: ఆస్తులను ధ్వంసం చేసిన 46 మందికి నోటీసులు
మరోవైపు..ఇదే ఆందోళనలకు సంబంధించి అరెస్ట్ చేసిన నలుగురు మదర్సా విద్యార్థులను పోలీసులు విడుదల చేశారు. అల్లర్లలో వారి ప్రమేయం లేదని పోలీసులు తేల్చడం వల్ల కోర్టు ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు.
ఇదీ చూడండి:శిశువుల మృత్యుఘోష: రాజస్థాన్లో మరో 10 మంది
Last Updated : Jan 4, 2020, 2:23 PM IST