తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో ఒక్కరోజే 6741 మందికి కరోనా.. 213 మరణాలు

By

Published : Jul 14, 2020, 7:32 PM IST

Updated : Jul 14, 2020, 8:09 PM IST

4,526 people tested positive for COVID-19 and 67 patients died in Tamil Nadu today
'మహా'లో ఒక్కరోజే 6741 మందికి కరోనా.. 213 మరణాలు

19:58 July 14

'మహా'లో ఒక్కరోజే 6741 మందికి కరోనా.. 213 మరణాలు

మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది.  కొత్తగా 6,741 మంది కరోనా బారిన పడ్డారు. మరో 213 మంది వైరస్​తో మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసులు 2,67,665కు పెరిగింది. మరణాల సంఖ్య 10,695కు చేరింది.

తమిళనాడులో వైరస్​ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గత 24 గంటల్లో 4,526మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలగా... మరో 67మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,47,324కు పెరిగింది. మరణాల సంఖ్య 2,099కు ఎగబాకింది.

కర్ణాటకలో మరో 2,496 మంది కరోనా బారిన పడగా... 87 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,839 చేరగా.. మృతుల సంఖ్య 842కు పెరిగింది.

దేశరాజధానిలో తగ్గుముఖం..

  • దిల్లీలో ఒక్కరోజులో 1,606 కేసులు నమోదయ్యాయి. మరో 35 మంది మరణించారు.
  • కేరళలో కొత్తగా 608 కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,930కు ఎగబాకింది.
  • పంజాబ్​లో మరో 340 మంది కరోనా బారిన పడ్డారు. మరో 9 మంది వైరస్​తో చనిపోయారు.​
  • ఒడిశాలో ఓ భాజపా ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.

19:52 July 14

మహారాష్ట్రలో ఒక్కరోజే 6 వేల 741 మంది కరోనా బారినపడ్డారు. మరో 213 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 10 వేల 695కు చేరింది. 

దిల్లీలో ఇవాళ 1606 కేసులు నమోదయ్యాయి. మరో 35 మంది మరణించారు. 

19:28 July 14

తమిళనాడులో మరో 4 వేల 526 కేసులు.. 67 మరణాలు

తమిళనాడులో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 4 వేల 526 మందికి వైరస్​ సోకింది. మరో 67 మంది కొవిడ్​బారిన పడి మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువైంది. 

కర్ణాటకలోనూ కరోనా విజృంభిస్తోంది. మంగళవారం మరో 2 వేల 496 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 87 మంది చనిపోయారు. 

Last Updated : Jul 14, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details