రాజ్యసభకు ఎన్నికైన నూతన సభ్యులందరూ నిబంధనలు పాటిస్తూ సభాగౌరవాన్ని కాపాడేలా ఉండాలని సూచించారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించకుండా వ్యవహరించాలన్నారు. పెద్దలసభకు కొత్తగా ఎన్నికైన 45మందితో ప్రమాణ స్వీకారం చేయించారు వెంకయ్య. కరోనా నేపథ్యంలో సభలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన 45మందిలో 36మంది తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నూతన సభ్యులను త్వరలోనే కమిటీలకు నామినేట్ చేస్తానని వెంకయ్య చెప్పారు.