ఫిబ్రవరి 26... భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు దాయాది భూమిలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని తునాతునకలు చేశాయి. మరోసారి భారత్‌వైపు చూడాలంటే వణికేలా సమాధానమిచ్చాయి.
8 నెలల అనంతరం జైషే మహ్మద్ ఉగ్రవాదులు... భారత్‌పై దుశ్చర్యకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం.
"దాదాపు 40-50 మంది ఆత్మాహుతి దళాలు పాకిస్థాన్ బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంలో శిక్షణ పొందుతున్నాయి."- ప్రభుత్వ వర్గాల సమాచారం
ఈ ఉగ్రస్థావరం కార్యకలాపాలపై భారత నిఘా సంస్థలు... సాంకేతిక నిఘాతో సహా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ శిక్షణ తీసుకొన్న కొంతమంది ఉగ్రవాదులను కశ్మీర్‌లోని భద్రతా శిబిరాలపై దాడులు చేసేందుకు పంపారట. ఈ స్థావరంపై భారత్ వైమానిక దాడి చేసిన 6 నెలల వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించలేదని సమాచారం.
పాకిస్థాన్ ఇటీవలే బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని పునర్నిర్మించిందని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గత నెలలో వెల్లడించారు.