కరోనాతో మహారాష్ట్ర విలవిల- తమిళనాడులోనూ తీవ్రం - కరోనా వైరస్ కేసులు
దేశంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6,497 కేసులు నమోదయ్యాయి. తాజాగా 193 మంది వైరస్‌కు బలయ్యారు. తమిళనాడులోనూ కరోనా తీవ్రత పెరిగింది. తాజాగా 4,328 కేసులు వెలుగుచూశాయి. 66 మంది మరణించారు.
కరోనాతో తమిళనాడు విలవిల.. కొత్తగా 4,328 కేసులు
By
Published : Jul 13, 2020, 7:28 PM IST
|
Updated : Jul 13, 2020, 8:00 PM IST
దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ.. మృతుల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో తాజాగా 6,497 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,60,924కు చేరింది. తాజాగా 193 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు మొత్తం 10,482 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,44,507 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,05,637 యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడు విలవిల...
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 4,328కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,798కు చేరింది. మరో 66మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 2,032కు పెరిగింది. తమిళనాడులో ఇప్పటివరకు 92,567మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 48,196 యాక్టివ్ కేసులున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,664...
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 1,664కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,130కి పెరిగింది. 21 తాజా మరణాలతో ఇప్పటివరకు రాష్ట్రంలో 955మంది కరోనా బారిన పడి మృతిచెందారు. తాజాగా 869మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు.
కేరళలో 449...
కేరళలో తాజాగా 449కేసులు వెలుగుచూశాయి. మరణాల రేటు 0.39శాతంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ.
రాష్ట్రం
కొత్త కేసులు
మొత్తం కేసులు
తాజా మరణాలు
మొత్తం మరణాలు
మహారాష్ట్ర
6,497
2,60,924
193
10,482
తమిళనాడు
4,328
1,42,798
66
2,032
ఉత్తరప్రదేశ్
1,664
38,130
21
955
గుజరాత్
902
42,808
10
2,057
అసోం
735
16,806
*
36
పంజాబ్
357
8,178
5
204
ఉత్తరాఖండ్
71
3,608
-
49
* అసోంలో కరోనా మరణాలపై ఆడిట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. అది పూర్తి అయిన అనంతరం మృతుల సంఖ్యను అప్డేట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.