తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో వరుణుడి బీభత్సం.. 43 మంది మృతి - ఉత్తర్​ప్రదేశ్​లో వరుణుడి బీభత్సం

ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షం కారణంగా జరిగిన ప్రమాదాల్లో 43 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్​.

43 deaths in UP in incidents related to rain, thunderstorm: State govt
ఉత్తర్​ప్రదేశ్​లో వరుణుడి బీభత్సం.. 43 మంది మృతి

By

Published : Jun 1, 2020, 11:37 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఆదివారం 43 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరణాలపై విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్​ ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

ఉన్నావ్​లో 8 మంది, కనౌజ్​లో ఐదుగురు మృతి చెందారు. వర్షం ధాటికి లఖ్​నవూలో ఓ ఇల్లు నేలమట్టమై ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుసుంభి ప్రాంతంలోనూ ఇల్లు కూలి 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.

రాగల 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో 50- 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి:భారత సీనియర్​ దౌత్య అధికారికి పాక్​ సమన్లు

ABOUT THE AUTHOR

...view details