తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా అనుమానం- రైలు నుంచి దింపాలని ప్రయాణికుల పట్టు

కరోనా పేరు ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఎవరి వద్ద నుంచి తమకు సోకుతుందోనన్నభయంతో జాగ్రత్తగా ఉంటున్నారు. కరోనా సోకిందన్న అనుమానంతో సహ ప్రయాణికులు చేసిన ఆందోళన వల్ల ముంబయి- దిల్లీ గరీబ్​రథ్​​ ఎక్స్​ప్రెస్​ రైల్లో నుంచి నలుగురు వ్యక్తులను రైల్వే అధికారులు దించేశారు. అనంతరం వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు.

4 passengers with 'home quarantine' stamp deboarded from train
కరోనా అనుమానం- రైలు నుంచి దించేందుకు ప్రయాణికుల పట్టు

By

Published : Mar 18, 2020, 7:45 PM IST

Updated : Mar 18, 2020, 11:50 PM IST

కరోనా అనుమానం- రైలు నుంచి దింపాలని ప్రయాణికుల పట్టు

కరోనా పేరు వింటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమకు ఎదురయ్యే ఏ వ్యక్తి ద్వారా వైరస్ సోకుతుందోనని అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పక్కన ఉన్న మనిషి తుమ్మితే చాలు.. అమ్మో కరోనా అంటూ ఆమడ దూరంలో ఉంటున్నారు. ప్రజల్లో కరోనా భయం ఏ స్థాయిలో నాటుకుపోయిందో చెప్పడానికి ఓ రైల్లో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. సహ ప్రయాణికుల ఆందోళన వల్ల ముంబయి నుంచి దిల్లీ వెళ్లే గరీబ్​రథ్​​ ఎక్స్​ప్రెస్​ రైల్లో.. చేతులపై గృహ నిర్బంధంలో ఉండాలని సూచించే స్టాంప్​ ఉన్న నలుగురిని రైల్వే అధికారులు దించేశారు. అనంతరం ఆ నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

దిల్లీ గరీబ్​రథ్​​ ఎక్స్​ప్రెస్​ రైల్లో.. చేతులపై 'గృహ నిర్బంధం' స్టాంప్​ ఉన్న నలుగురు వ్యక్తులను పాల్ఘర్ స్టేషన్​లో రైల్వే అధికారులు దించేశారు. పాల్ఘర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు.

జరిగింది ఇదీ..

దిల్లీ వెళ్లే గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లోకి ముంబయి స్టేషన్లో నలుగురు వ్యక్తులు చేతులపై గృహనిర్బంధంలో ఉండాలన్న స్టాంపులతో ఎక్కారు. వీరిని చూసిన తోటి ప్రయాణికులు ప్రత్యేక శిబిరం నుంచి తప్పించుకువచ్చారేమోనన్న అనుమానంతో ఆందోళనకు దిగారు. అలారం మోగించి రైలు అధికారులను పిలిచారు. వారి అభ్యంతరాన్ని తెలిపి వైరస్ పీడితులను రైలు నుంచి దించేయాలని కోరారు. అప్రమత్తమైన అధికారులు వారిని పాల్ఘర్ స్టేషన్​ వద్ద రైలు నుంచి దించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

స్టాంపుల వెనక కథ..

సూరత్​కు చెందిన నలుగురు వ్యక్తులు ఇటీవల జర్మనీ నుంచి వచ్చారు. ఆ నలుగురికి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా వైరస్​ లేదని తేలింది. అయితే వారి చేతులపై 14రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని సూచించే స్టాంప్​ వేసినట్లు సమాచారం. వాటిని చూసే ప్రయాణికులు ఆందోళన చెందారు.

ఇదీ చూడండి:కరోనాపై అవగాహనకు పోలీసుల 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్'

Last Updated : Mar 18, 2020, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details