జమ్ముకశ్మీర్‌లో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. రెండు గంటల వ్యవధిలో నాలుగు స్వల్ప భూకంపాలు ఏర్పడ్డాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 4.7-5.5 మధ్య తీవ్రతలు నమోదైనట్టు పేర్కొంది.
రాత్రి 10 గంటల 42 నిమిషాలకు 4.7 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. అనంతరం 5.5 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. వీటి మధ్య 6 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది.
రాత్రి 10 గంటల 58 నిమిషాలకు మూడో భూకంపం(4.6 తీవ్రత) ఏర్పడింది. 11 గంటల 20 నిమిషాలకు నాలుగోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.