దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశానంటిన వేళ.. మహారాష్ట్రలో ఓ రైతుకు చెందిన ఉల్లి బస్తాలను చోరీకి గురయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉల్లి బస్తాల చోరీ- నిందితుల అరెస్ట్ - Pune onion Theft
మహారాష్ట్రలోని పుణెలో రూ.2.35 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ చేశారు నలుగురు వ్యక్తులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పుణెలో ఉల్లిపాయల చోరీ
రూ.2.35 లక్షల విలువైన 58 బస్తాల ఉల్లిపాయలను అపహరించారని పుణె గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ 49 బస్తాలు స్వాధీనం చేసుకున్నామని మిగిలిన ఉల్లిపాయలను అమ్మేశారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వారి ఆచూకీ కనుగొన్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: అమాంతం జనంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్