గుజరాత్లో 5 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఇవాళ ప్రారంభం కానున్నాయి. అయితే.. సెషన్‌కు ముందు నలుగురు ఎమ్మెల్యేలు కొవిడ్ బారినపడటం కలకలం రేపింది. సమావేశాల నేపథ్యంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. ముగ్గురు కాంగ్రెస్, ఒక భాజపా ఎమ్మెల్యేకు వైరస్ సోకింది. ఇంకా అందరికీ పరీక్షలు చేపట్టలేదని.. సెషన్ ప్రారంభానికి ముందు నెగెటివ్‌గా తేలితేనే వారందరికీ సమావేశాలకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఆ రాష్ట్రంలో స్పీకర్‌కే..
సెప్టెంబర్ 23న ఒక్కరోజు సమావేశం కానుంది ఉత్తరాఖండ్ అసెంబ్లీ. అయితే.. సెషన్‌కు ముందు కరోనా బారినపడ్డారు సభాపతి ప్రేమ్‌చంద్ అగర్వాల్. వైరస్ సోకిందని ఆదివారం ట్వీట్ చేసిన అగర్వాల్... తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఇందిరా హృదయేశ్కు కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.