తమిళనాడు చెన్నైలో సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వాషర్మెన్పేట్ వద్ద నిరసనలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన భద్రతాసిబ్బందిని ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిరసనకారులతో సంప్రదింపులు జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనలను విరమింపజేశారని తెలుస్తోంది .
సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు - CAA protest in Chennai
తమిళనాడులో సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనలు హింసాత్మక రూపు దాల్చాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులు గాయపడ్డారని సమాచారం. నిరసనకారులతో పోలీసు ఉన్నతాధికారుల సంప్రదింపుల అనంతరం ఆందోళనలు విరమించారని తెలుస్తోంది.

సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు
సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు
సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని బలవంతంగా చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించిన కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొంతమందిని నిర్బంధించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిరసనకారులతో సంప్రదింపుల అనంతరం తమ అదుపులో ఉన్న వారిని విడుదల చేశారు పోలీసులు. ఉద్రిక్తతలు నెలకొన్న కారణంగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ చూడండి:దిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్
Last Updated : Mar 1, 2020, 9:30 AM IST