తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంపన్​పై యుద్ధం: 37 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సిద్ధం - ఆంపన్ తుపాను తాజా వార్తలు

అంపన్​ తుపాను సూపర్​ సైక్లోన్​గా మారనున్న నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం అప్రమత్తమైంది. బంగాల్, ఒడిశాలకు 37 బృందాలను తరలించింది. కరోనా మహమ్మారి, అంపన్​ తుపానును ఏకకాలంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్​డీఆర్​ఎఫ్​ స్పష్టం చేసింది.

CYCLONE-NDRF
ఎన్​డీఆర్​ఎఫ్

By

Published : May 18, 2020, 3:47 PM IST

కరోనా అంతకంతకూ విజృంభిస్తోన్న తరుణంలో దేశం మరో విపత్తును ఎదుర్కోబోతోంది. మరో రెండు రోజుల్లో అంపన్ తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెండు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​).

రెండు విపత్తులను ఎదుర్కొనేందుకు మరో 20 సహాయక బృందాలను ఏర్పాటు చేసింది ఎన్​డీఆర్​ఎఫ్​. మొత్తం 37 బృందాలు పనిచేయనున్నట్లు ఎన్​డీఆర్​ఎఫ్ డీజీ ఎస్​ఎన్​ ప్రధాన్​ వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

"ఎన్​డీఆర్​ఎఫ్​కు చెందిన 37 బృందాలను బంగాల్​, ఒడిశాకు తరలించాం. ఇందులో 20 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయి. 17 బృందాలను అవసరానికి ఉపయోగించేలా సిద్ధం చేశాం. కరోనా నేపథ్యంలో ఒకేసారి రెండు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది."

- ఎస్​ఎన్​ ప్రధాన్, ఎన్​డీఆర్​ఎఫ్​ డీజీ​

ఒక బృందంలో 45 మంది సభ్యులు ఉంటారు. ఒడిశాలో ఏడు, బంగాల్​లో 6 జిల్లాలకు బృందాలను తరలించారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రధాన్​ తెలిపారు.

సూపర్ సైక్లోన్​..

అంపన్ తుపాన్ సూపర్ సైక్లోన్​గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం 13 కి.మీ వేగంతో కదులుతున్న ఈ అంపన్​.. మే 20 నాటికి బంగాల్​లోని దిఘా, బంగ్లాదేశ్​లోని హతియా ద్వీపాల మధ్య 185 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది.

ఒడిశా పారదీప్​కు దక్షిణాన 790 కి.మీ, బంగాల్​లోని దిఘాకు నైరుతి దిశగా 940 కి.మీ, బంగ్లాదేశ్​ ఖేపుపారాకు 1060 కి.మీ దూరంలో అంపన్ కేంద్రీకృతమై ఉందని ఐఎమ్​డీ పేర్కొంది. ప్రస్తుతం ఇది బంగాల్ తీరం వెంబడి దక్షిణ-నైరుతి దిశగా 13 కి.మీ వేగంతో పయనిస్తోందని తెలిపింది.

ఇదీ చూడండి:సూపర్ సైక్లోన్​గా మారుతున్న అంపన్​

ABOUT THE AUTHOR

...view details