తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం తాగాడు... పామును ముక్కలుగా కొరికాడు! - ఉత్తర్​ప్రదేశ్​

పాము కనిపిస్తే భయంతో దూరంగా పరుగెడతాం. కొందరైతే ధైర్యం చేసి కర్రతో కొట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ మద్యం మత్తులో ఓ యువకుడు పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అస్రౌలి గ్రామంలో చోటు చేసుకుంది.

మద్యం తాగాడు... పామును ముక్కలుగా కొరికాడు!

By

Published : Jul 30, 2019, 7:01 AM IST

Updated : Jul 30, 2019, 8:06 AM IST

మద్యం తాగాడు... పామును ముక్కలుగా కొరికాడు!
మద్యం మత్తులో తనకు కనిపించిన పామును ముక్కలుగా కొరికేశాడు రాజ్​కుమార్​ అనే యువకుడు. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలోని అస్రౌలి గ్రామంలో చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది...

మద్యం మత్తులో ఉన్న రాజ్​కుమార్​ను పాము కాటేసిందని బంధువులు తెలిపారు. అనంతరం కోపంతో ఊగిపోయిన అతడు... పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడని వివరించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజ్​కుమార్​ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు బంధువులు. అతనితో పాటు ముక్కలైన పామునూ సంచిలో వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

రాజ్​కుమార్​ను పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అలిఘఢ్ లేదా ఆగ్రాకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే యువకుని శరీరంపై ఎలాంటి పాము కాటు కనిపించలేదని తెలిపారు.

" రాజ్​కుమార్​ అనే యువకుడ్ని ఇక్కడకు తీసుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు పాము ముక్కలనూ తెచ్చారు. అతడిని పరీక్షించాం. కానీ ఎలాంటి పాము కాటు కనిపించలేదు."

- రాహుల్​ వర్ష్​నేయ్​, జిల్లా ఆసుపత్రి వైద్యుడు.

ఇదీ చూడండి: పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్​గా నామకరణం!

Last Updated : Jul 30, 2019, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details