భారత్‌లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. మహారాష్ట్రలో 3వేల 390 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 120 మంది మరణించారు. దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో 2 వేల 224 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. తమిళనాడులో మరో 1,974 మందికి వైరస్ సోకింది. గుజరాత్లో 511 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 499మందికి పాజిటివ్‌గా తేలింది.
దేశంలో కరోనా విజృంభణ
By
Published : Jun 14, 2020, 9:10 PM IST
|
Updated : Jun 14, 2020, 9:53 PM IST
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా మహారాష్ట్రలో కొత్తగా 3వేల 390 కేసులు నమోదయ్యాయి. మరో 120 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 7వేలు దాటింది. మరణాల సంఖ్య 3,950కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసులలో 1395 ముంబయికి చెందినవే.
దిల్లీలో రికార్డు..
దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయిలో కొత్తగా 2వేల 224 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 56 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 41వేల 182కు చేరింది. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1327కి పెరిగింది.
తమిళనాడులో 1974..
దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కొత్తగా 1,974 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,661కి చేరింది. మరణాల సంఖ్య 435కి పెరిగింది. 24,547 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 1,415 చెన్నైకి చెందినవే.
గుజరాత్లో 500కుపైగా...
గుజరాత్లో కొత్తగా 511 కేసులు వెలుగుచూశాయి. మరో 29మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 23వేల 590కి చేరింది. ఇప్పటి వరకు 1478మంది వైరస్‌కు బలయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్ ప్రదేశలో ఆదివారం మరో 499 మంది వైరస్ బారిన పడ్డారు. 14 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 13వేల 615కు చేరగా.. మృతుల సంఖ్య 399గా ఉంది.
రాజస్థాన్‌లో
రాజస్థాన్‌లో కొత్తగా 133 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 12,532కు చేరగా.. మరణాల సంఖ్య 286కి పెరిగింది. 9వేల 59 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
అసోంలో 4 వేలకు చేరువగా..
అసోంలో మరో 43 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3వేల943కు చేరింది. ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 1805 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
కేరళలో..
కేరళలో కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మరో 54 మందికి వైరస్ సోకింది. వారిలో ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2,460కి చేరింది.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన కేసులు