ఉత్తరాఖండ్ దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ.. తొమ్మిది దశాబ్దాల చరిత్రలో నేడు ఓ కొత్త అధ్యయనం లిఖించింది. 333 మంది భారత సైన్యంలో చేరుతున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. కరోనా రక్కసి కాలుదువ్వుతున్నందున కేవలం అధికారులు, సిబ్బంది, ప్రముఖుల సమక్షంలో ఈ పరేడ్ నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను రద్దు చేశారు. క్యాడెట్ల కుటుంబాలకు ఈసారి ఆహ్వానం అందలేదు. ప్రేక్షకుల ప్రాంతం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది.
ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో మొత్తం 423 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఇందులో 333 మంది భారతీయ జవాన్లు కాగా, తొమ్మిది మిత్రదేశాలకు చెందిన 90 మంది జంటిల్మన్ క్యాడెట్స్ ఉన్నారు.
మిలిటరీ అకాడమీ, దేహ్రదూన్ పరేడ్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే ఎలాంటి సంప్రదాయాలు నిర్వహిస్తారు...
- ఐఎంఏలో శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో చేరే క్యాడెట్లకు కుటుంబ సభ్యులు ర్యాంకు బ్యాడ్జీలను అందించటం సంప్రదాయం. కానీ తొలిసారి బంధువులు లేకుండానే ఈ పరేడ్ నిర్వహిస్తున్నారు.
- పరేడ్ సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపిస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. కానీ, కరోనా కారణంగా ఈసారి అలాంటి వాటిని రద్దు చేశారు.
- ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మెడల్స్ అందించే కార్యక్రమంలో మార్పులు చేశారు. చేతితో తాకకుండా అందించే ఏర్పాట్లు చేశారు.
ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది...
ఈసారి భారత సైన్యంలోకి 333 మంది అధికారులు చేరుతున్నారు. అందులో ఉత్తర్‌ప్రదేశ్-66, హరియాణా-39, ఉత్తరాఖండ్-31, బిహార్-31, పంజాబ్-25, మహారాష్ట్ర-18, హిమాచల్‌ప్రదేశ్-14, జమ్ముకశ్మీర్-14, రాజస్థాన్-13, మధ్యప్రదేశ్-13, కేరళ-8, గుజరాత్-8, దిల్లీ-7, కర్ణాటక-7, బంగాల్-6, ఆంధ్రప్రదేశ్-4, ఛత్తీస్‌గఢ్-4, ఝార్ఖండ్-4, మణిపుర్-4, చండీగఢ్-3, అసోం-2, ఒడిశా-2, తమిళనాడు-2, తెలంగాణ-2, మేఘాలయ-2, మిజోరాం-2, లద్దాఖ్-2.