తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7 నెలల్లో 33వేల టన్నుల కొవిడ్‌ వ్యర్థాలు! - గుజరాత్​లో కొవిడ్ వ్యర్థాలు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుతున్నప్పటికీ వ్యర్థాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన ఏడు నెలల్లోనే దాదాపు 33వేల టన్నుల కొవిడ్‌ వ్యర్థాలు సేకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. వీటిలో అత్యధికంగా ఒక్క మహారాష్ట్ర నుంచే మూడున్నర వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు తెలిపింది.

covid-19 waste in 7 months
7 నెలల్లో 33వేల టన్నుల కొవిడ్‌ వ్యర్థాలు!

By

Published : Jan 10, 2021, 11:02 PM IST

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజుల వంటి బయోమెడికల్‌ ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా కేవలం ఏడు నెలల్లోనే అన్ని రాష్ట్రాల నుంచి 32,994 టన్నుల వ్యర్థాలు సేకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్(సీపీసీబీ) వెల్లడించింది. ఒక్క అక్టోబర్‌ నెలలోనే దాదాపు 5500టన్నుల వ్యర్థాలు వచ్చినట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 5367 టన్నులు, కేరళ-3300టన్నులు, గుజరాత్‌ 3086 టన్నులు, తమిళనాడు-2806, ఉత్తర్‌ ప్రదేశ్‌-2502, దిల్లీ-2471, పశ్చిమ బెంగాల్‌-2095, కర్ణాటక-2026 టన్నుల వ్యర్థాలు లభ్యమయ్యాయని సీపీసీబీ వెల్లడించింది.

ఇలా సేకరించిన వ్యర్థాలను దేశవ్యాప్తంగా ఉన్న 198 బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి శుద్ధిచేస్తారు. వీటిలో పీపీఈ కిట్లు, మాస్కులు, షూ కవర్లు, గ్లౌజులు, టిష్యూ, కాటన్‌ స్వాబ్‌లు, సూదులు, సిరంజీలు వంటి ఉత్పత్తులు ఉన్నాయి.

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్‌ నియంత్రణ, చికిత్సలో వాడే బయో మెడికల్‌ వ్యర్థాలను నిబంధనలకు లోబడి శుద్ధిచేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను గతంలోనే విడుదల చేసింది. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌ రూపొందించి ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తోంది.

ఇదీ చదవండి:జల్లికట్టులో విషాదం- గోడ కూలి ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details