తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఆసుపత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా - covid virus

దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న వేళ.. తూర్పు దిల్లీలోని ఓ ఆసుపత్రిలో 33 మంది వైద్యసిబ్బందికి వైరస్​ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

33 medical staff including doctor-nurse found corona positive
ఆ ఆసుపత్రిలో 33 మంది వైద్యసిబ్బందికి కరోనా

By

Published : Apr 27, 2020, 10:50 AM IST

ప్రాణాంతక కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు. క్లిష్ట సమయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బంది కూడా ఎక్కువగా వైరస్​కు ప్రభావితమవుతున్నారు. తూర్పు దిల్లీలో ఇవాళ 33 మంది వైద్య సిబ్బంది వైరస్​​ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.

పట్​పడ్​గంజ్​లోని మ్యాక్స్​ ఆసుపత్రిలో కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా డాక్టర్​, నర్సుతో పాటు మొత్తం 33 మంది సిబ్బందికి వైరస్​ నిర్ధరణ అయింది.

దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో 2,918 మందికి వైరస్​ సోకింది. 877 మంది కోలుకోగా.. 54 మంది ప్రాణాలు విడిచారు.

ABOUT THE AUTHOR

...view details