తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాపం కుంభకోణం: 31 మంది దోషులు-25న తీర్పు - భోపాల్ సీబీఐ కోర్టు

మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణంలో 31 మందిని దోషులుగా నిర్ధరించింది భోపాల్ సీబీఐ కోర్టు. నవంబర్​ 25కు తీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2013లో బయటపడిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వ్యాపం కుంభకోణం

By

Published : Nov 22, 2019, 10:51 PM IST

మధ్యప్రదేశ్​లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ ప్రవేశ పరీక్ష కుంభకోణంలో 31 మందిని దోషులుగా తేల్చింది భోపాల్ సీబీఐ కోర్టు. తీర్పును నవంబర్ 25కు వాయిదా వేసింది.

మధ్యప్రదేశ్​లో 1982లో ప్రొఫెషనల్​​ కోర్సుల్లో ప్రవేశాల కోసం వ్యాయ్​సాయిక్ పరీక్ష మండల్​ (వ్యాపం)ను ఏర్పాటు చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం హయాంలో రూ.3 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో చాలా మంది నేతలు, అధికారులపై ఆరోపణలు వచ్చాయి.

కేసు పూర్వాపరాలు..

1982: ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి వ్యాయ్​సాయిక్ పరీక్ష మండల్​ (వ్యాపం) ఏర్పాటు చేశారు.

2008: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను ఇందులో మిళితం చేశారు.

2009: వైద్య విద్య పరీక్ష పత్రం లీకేజీ- మొదటి ఫిర్యాదు నమోదు

2009 జులై 5: నియామకాల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి.

2009 డిసెంబర్: కుంభకోణంపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

2013 జులై 7: ఎఫ్​ఐఆర్ నమోదు, 20 మంది అరెస్టు

2013 జులై 16: కుంభకోణం ప్రధాన నిందితుడు జగదీశ్ సాగర్ అరెస్టు

2013 ఆగస్టు 26: కేసును ప్రత్యేక టాస్క్​ఫోర్స్​కు అప్పగింత.. 55 ఎఫ్​ఐఆర్​ల నమోదు

2013 అక్టోబర్​ 9:345 మంది అభ్యర్థుల ప్రవేశాల రద్దు

2013 డిసెంబర్ 18: మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత శర్మపై కేసు నమోదు

2015 జూన్ 29:వివిధ కారణాల వల్ల 23 మందికి కేసుతో సంబంధముందని సిట్​ ప్రకటన

2015 జులై 4:నిందితుడైన ఎంబీబీఎస్ విద్యార్థి నమ్రతా దామోర్ తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించిన పాత్రికేయుడు అక్షయ్ సింగ్ మరణం

2015 జులై 5:నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వైద్య కళాశాల డీన్​ మరణం

2015 జులై 7:సీబీఐ దర్యాప్తునకు శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకారం

2015 జులై 8:నమ్రతా దామోర్ హత్య కేసును పునర్విచారణకు పోలీసుల నిర్ణయం

2015 జులై 9:వ్యాపం కుంభకోణానికి సంబంధించి అన్ని కేసులను సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు

2015 జులై 11:కుంభకోణానికి సంబంధించి చౌహాన్​ వద్ద సమాచారం ఉందని సమాచార హక్కు పత్రాల ద్వారా వెల్లడి

2015 జులై 13:40 మందితో సీబీఐ దర్యాప్తు బృందం ఏర్పాటు

2015 జులై 16: 150 మందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ

2015 జులై 17: సీబీఐ ఎఫ్​ఐఆర్​లో నమోదైన పార్టీనేతను సస్పెండ్ చేసిన భాజపా

2015 జులై 20: ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిట్​కు సుప్రీం అనుమతి

2015 జులై 29: 18 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు

2015 ఆగస్టు 11: జగదీశ్ సాగర్ ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడీ

2015 ఆగస్టు 22: 1,200 మందిపై 7 కేసులు నమోదు చేసిన సీబీఐ

2015 ఆగస్టు 25: 212 కేసుల్లో చర్యలు తీసుకునేందుకు సీబీఐకి 3 వారాల గడువు ఇచ్చిన సుప్రీం

2015 సెప్టెంబర్ 18: డాక్టర్ రాయ్​, ఆయన భార్య బదిలీను ఉపసంహరించుకున్న ప్రభుత్వం

2016 సెప్టెంబర్ 7: డాక్టర్​ రాయ్ ఆరోపణలపై స్పందించేందుకు సుప్రీం నిరాకరణ

2016 నవంబర్ 22: ఎంపీ మాజీ గవర్నర్ రామ్​ నరేశ్ యాదవ్ మరణం

2017 ఫిబ్రవరి 13: ఎంబీబీఎస్ కోర్సుల్లో 634 మంది విద్యార్థుల ప్రవేశాన్ని రద్దు చేసిన సుప్రీం

2017 నవంబర్ 26:సుమారు 200 అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలన్న సీబీఐ

2017 డిసెంబర్ 21:491 మంది నిందితులకు వారి ఛార్జిషీట్ డీవీడీలను అందించిన సీబీఐ

2018 జనవరి 16: 95 మందిపై కొత్త ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ

2018 ఫిబ్రవరి 8:లక్ష్మీకాంత శర్మపై కేసు నమోదు

2018 మార్చి 22:జేఎన్​ చౌక్సీని అరెస్టు చేసిన సీబీఐ

2018 సెప్టెంబర్ 27:దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాకు వ్యతిరేకంగా ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశం

2019 జులై 28: వ్యాపంలో చాలా అక్రమాలు జరిగినట్లు నివేదిక వెల్లడి

2019 నవంబర్ 21: 31 మందిని దోషులుగా నిర్ధరణ..

2019 నవంబర్ 25: తీర్పు

ABOUT THE AUTHOR

...view details