తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కరి నుంచి కుటుంబంలోని 31 మందికి కరోనా

దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం.. శనివారం మరో 186 మంది కొవిడ్​ బారినపడగా.. ఒకరు మరణించారు. జహంగీర్​పురీలో ఒక్కరి నుంచి... కుటుంబంలోని 31 మందికి కరోనా సోకడం ఆందోళన రేకెత్తిస్తోంది.

31 of extended family test positive for COVID-19 in Delhi
ఒక్కరి నుంచి కుటుంబంలోని 31 మందికి కరోనా!

By

Published : Apr 19, 2020, 5:30 AM IST

Updated : Apr 19, 2020, 6:37 AM IST

దేశంలో కల్లోలం సృష్టిస్తోన్న కరోనా.. దిల్లీలో విరుచుకుపడుతోంది. శనివారం మరో 186 మందికి వైరస్​ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 1893కు చేరింది. నిన్న మరొకరు మృతిచెందగా.. ఇప్పటివరకు మొత్తం 43 మంది ప్రాణాలు విడిచారు.

ఆ 31 మందికి...

ఉత్తర దిల్లీ జహంగీర్​పురీలో నివసిస్తున్న ఓ కుటుంబంలోని 31 మందికి కరోనా సోకింది. ఈ వార్త స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. వీరంతా ప్రస్తుతం నరేలాలోని సెల్ఫ్​ ఐసోలేషన్​ కేంద్రంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక మహిళ నుంచే వీరందిరికీ కరోనా సోకినట్లు వెల్లడించారు. అయితే.. వీరెవరికీ వైరస్​ లక్షణాలు బయటపడలేదని పేర్కొనడం గమనార్హం.

''జహంగీర్​పురీలో ఏప్రిల్​ 8న ఓ మహిళ మృతిచెందింది. ఏప్రిల్​ 10న చేసిన కరోనా పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమె కుటుంబంలోని 26 మందికి శుక్రవారమే కొవిడ్​ నిర్ధరణ కాగా... శనివారం మరో ఐదుగురు కరోనా బారినపడ్డారు. ఇందులో చిన్నపిల్లలూ ఉన్నారు.''

- సీనియర్​ అధికారి

జ‌హంగీర్‌పురీ ప్రాంతాన్ని ఏప్రిల్​ 10నే కంటైన్​మెంట్​ జోన్​గా గుర్తించి... సీల్​ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఇక్కడ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌జ‌లు ఏమాత్రం పాటించ‌డంలేదని అధికారులు పేర్కొంటున్నారు. దిల్లీలో మొత్తం 76 ప్రాంతాలను కంటైన్​మెంట్​ జోన్లుగా ప్రకటించారు.

Last Updated : Apr 19, 2020, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details