దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాతే వల్ల దేశంలో కరోనా వేగంగా విస్తరించిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. మర్కజ్ సమావేశాల వల్ల 17 రాష్ట్రాలపై వైరస్ ప్రభావం పడిందని పేర్కొంది . దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతం తబ్లీగీతో సంబంధమున్నవేనని విశదీకరించింది. తబ్లీగీ కారణంగా వైరస్ బాధితులుగా తేలినవారి సంఖ్య ఇప్పటివరకు 1023 గా ఉందని స్పష్టం చేసింది.
ఆ రాష్ట్రాల్లో జల్లెడ..
దిల్లీ మర్కజ్లో పాల్గొన్నవారి కోసం 17 రాష్ట్రాల్లో అధికారులు గాలిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ. కాంటాక్టు ట్రేసింగ్ల కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మర్కజ్‌కు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన 22,000 మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచినట్లు వెల్లడించింది.