తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమానుషం: చిన్నారిపై అత్యాచారం.. తల నరికివేత - 3 ఏళ్ల చిన్నారి

దేశంలో మరో అత్యాచార ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసి.. అనంతరం బాలికను అతి కిరాతకంగా చంపేశారు కీచకులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అమానుషం: చిన్నారిపై అత్యాచారం.. తల నరికివేత

By

Published : Aug 1, 2019, 7:59 AM IST

ఝార్ఖండ్​లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మృగాళ్ల పైశాచికత్వానికి మూడేళ్ల చిన్నారి బలైంది. బాలికను అత్యాచారం చేసిన కీచకులు... తర్వాత చిన్నారి తలను శరీరం నుంచి వేరు చేశారు.

ఆలస్యంగా వెలుగులోకి...

భర్తతో గొడవపడిన ఓ మహిళ... తన కూతురిని తీసుకుని మరో వ్యక్తితో శుక్రవారం రాత్రి టాటానగర్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంది. నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. భయాందోళనకు గురైన మహిళ... తన కూతురు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు వచ్చిన వ్యక్తిపై అనుమానాలు ఉన్నట్టు వెల్లడించింది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... రైల్వేస్టేషన్​లోని సీసీటీవి ఫుటేజ్​ ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారు అందించిన సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్​ దగ్గర్లో ఒక సంచిని కనుగొన్నారు. ఆ సంచిలో బాలిక మొండం లభించింది.

బాలికను అపహరించిన అనంతరం అత్యాచారం చేసి, తలను నరికేసినట్టు ఇద్దరు నిందితులు అంగీకరించారు. చిన్నారి తలను కనుగొనేందుకు జాగిలాలను రంగంలోకి దింపారు పోలీసులు. ఈ పూర్తి వ్యవహారంలో మహిళతో పాటు వచ్చిన వ్యక్తి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:- 'ఆహారమే ఒక మతం'- జొమాటో పంచ్​ అదిరింది​

ABOUT THE AUTHOR

...view details