దిల్లీలోని షాలిమార్బాగ్ ప్రాంతానికి చెందిన ఓ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దిల్లీలో మరో అగ్నిప్రమాదం- ముగ్గురు మహిళలు మృతి - DELHI LATEST NEWS
దిల్లీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. షాలిమార్బాగ్లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలకు ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
దిల్లీలో మరో అగ్నిప్రమాదం- ముగ్గురు మహిళలు మృతి
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... గంట సేపు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
దిల్లీలో ఇటీవలి కాలంలో అగ్నిప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల ముందే.. అనాజ్ మండీలోని ఓ కర్మాగారంలో మంటలు చెలరేగి 43మంది మృతిచెందారు. మరో 62మంది తీవ్రంగా గాయపడ్డారు.
Last Updated : Dec 14, 2019, 11:12 PM IST