తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోలు హతం - ఎదురుకాల్పులు

ఝార్ఖండ్​ గిరీడీ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు మావోలు హతమయ్యారు. ఒక సీఆర్​పీఎఫ్ జవాను అమరుడయ్యారు. ఒక ఏకే-47 సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోలు హతం

By

Published : Apr 15, 2019, 10:07 AM IST

Updated : Apr 15, 2019, 11:40 AM IST

ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోలు హతం

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఝార్ఖండ్​ గిరీడీ జిల్లా బెల్భాఘాట్​ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు సహా ఓ సీ​ఆర్​పీఎఫ్​ జవాను ప్రాణాలు కోల్పోయారు.

​బెల్భా అటవీ ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ 7వ బెటాలియన్ ఉదయం కూంబింగ్​కు వెళ్లింది. ఉదయం 6గంటల సమయంలో వారిపై నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని భద్రతా సిబ్బంది దీటుగా తిప్పికొట్టారు.

​ఘటనాస్థలి నుంచి ఒక ఏకే-47 రైఫెల్, తూటాలు, 4 పైపు బాంబులు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఎన్​కౌంటర్​ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
7 విడతల సార్వత్రిక ఎన్నికల్లో చివరి 4 విడతల్లో ఝార్ఖండ్​లో పోలింగ్​ జరగనుంది.

Last Updated : Apr 15, 2019, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details