కాల్ సెంటర్ల పేరిట మోసాలకు పాల్పడ్డ ముగ్గురు భారతీయ అమెరికన్లు సహా ఎనిమిది మందికి అమెరికా కోర్టు శిక్ష ఖరారు చేసింది. వేలాది మంది అమెరికన్లకు సమారు 26 కోట్ల 40 లక్షల రూపాయల మేర మోసగించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. భారత్ కేంద్రంగా వీరంతా కాల్ సెంటర్ మోసాలకు పాల్పడినట్లు అమెరికా న్యాయవాది తెలిపారు.
అహ్మదాబాద్ నుంచే..
మహ్మద్ ఖాజిమ్, పాలక్ కుమార్ పటేల్, మహ్మద్ సోజబ్ మోమిన్ అనే ముగ్గురు భారతీయ అమెరికన్లు కాల్‌సెంటర్ ముఠాలో భాగస్వాములు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్ల నుంచి వీరు మోసాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధరించింది. దోషులకు ఆరు నెలల నుంచి నాలుగేళ్ల తొమ్మిది నెలల వరకు శిక్ష విధించింది.
"కోర్టుకు అందిన సమాచారం ప్రకారం వీరంతా భారత్‌లోని ముఠాతో కలిసి కాల్ సెంటర్ పథకంతో మోసాలకు పాల్పడ్డారు. అక్రమంగా సమాచారం సేకరించి కాల్ సెంటర్ల నుంచి బాధితులకు ఫోన్ చేశారు. అంతర్గత రెవెన్యూ సేవలు అందిస్తామని, రుణాలు ఇస్తామంటూ అమెరికాలో వేలాది మంది అమాయక ప్రజలను మోసం చేసి లాభాలు ఆర్జించారు."