తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో విరుచుకుపడ్డ నక్సల్స్​.. నలుగురు మృతి - JAHARKHAND LATEST NEWS

ఝార్ఖండ్​ ఎన్నికల సమీపిస్తున్న వేళ.. పోలీసు బృందమే లక్ష్యంగా మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్​ దాడిని ఖండించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్​ దాస్​. దాడి నేపథ్యంలో మాజీ ఐపీఎస్​ అధికారి ఎమ్​.కే దాస్​ను ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ.

ఝార్ఖండ్​లో విరుచుకుపడ్డ నక్సల్​.. నలుగురు మృతి

By

Published : Nov 23, 2019, 5:05 AM IST

Updated : Nov 23, 2019, 5:46 AM IST

ఝార్ఖండ్​లోని లాతేహార్​లో జరిగిన నక్సల్స్​ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు మృతిచెందాడు. దీనితో ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

లుకైతండ్​ గ్రామంలో పోలీసు బృందం గస్తీ కాస్తుండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాహనంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మృతుల్లో ముగ్గురు హోంగార్డులు, ఓ ఎస్సై ఉన్నారు.

ఘటనాస్థలం
ఘటనాస్థలం
మృతిచెందిన హోంగార్డు

మావోయిస్టుల దాడిని ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి రఘుబర్​ దాస్​ ఖండించారు. మృతి చెందిన వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు దేశం అండగా ఉంటుందని ట్వీట్​ చేశారు.

ముఖ్యమంత్రి ట్వీట్​

ఎన్నికల వేళ...

ఝార్ఖండ్​లో ఈ నెల 30 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో నక్సలైట్లు దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దాడి నేపథ్యంలో ఎన్నికల పర్యవేక్షణ కోసం మాజీ ఐపీఎస్​ అధికారి ఎమ్​.కే దాస్​ను ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా నియమించింది ఎన్నికల సంఘం(ఈసీ).

ఇదీ చూడండి:-తప్పిపోయాడనుకుంటే నెదర్లాండ్స్​లో ప్రత్యక్షమయ్యాడు..!

Last Updated : Nov 23, 2019, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details