తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్మృతి అనుచరుడి హత్య కేసులో  ముగ్గురి అరెస్టు - SMRITI

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్​ హత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. నిందితుల్లో ఒకరికి సురేంద్రతో రాజకీయ కక్షలు ఉన్నాయని అమేఠీ ఎస్పీ చెప్పారు.

స్మృతీ అనుచరుడి హత్య కేసులో  ముగ్గురి అరెస్టు.

By

Published : May 28, 2019, 7:13 AM IST

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అనుచరుడు, భాజపా కార్యకర్త సురేంద్ర సింగ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్​ డీజీపీ ఓపీ సింగ్​ తెలిపారు. హత్య అనంతరం మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ముగ్గురికి సంబంధమున్నట్లు నిర్ధరించారు.

నిందితుడి తండ్రితో సురేంద్ర సింగ్​కు గతంలో రాజకీయ కక్షలు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు.

ఈ హత్య కేసుపై విచారణ వేగవంతం చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ డీజీపీని ఆదేశించిన మరునాడే అరెస్టులు జరిగాయి.
శనివారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో అమేఠీ జిల్లా బరౌలియా గ్రామానికి చెందిన 50 ఏళ్ల సురేంద్ర సింగ్​ మరణించాడు.

ఇదీ చూడండి: మోదీ ప్రమాణ స్వీకారానికి రజినీ, కమల్​కు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details