అతివేగం రహదారులపై నెత్తుటేరులు పారిస్తోంది. ఏటా వేల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గతేడాది దేశవ్యాప్తంగా 4.49 లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయట. 2019కి సంబంధించి రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని రాజ్యసభకు తెలిపిన కేంద్రం.. ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
మొత్తం 2019లో 4 లక్షల 49 వేల 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 71 శాతం( 3,19,028) యాక్సిడెంట్లకు అతివేగమే కారణమని స్పష్టం చేశారు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు.. పార్లమెంటు సభ్యులతో ప్రతి జిల్లాలోనూ రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.