ప్రారంభించిన మూడు రోజులకే దేశంలోని తొలి సీప్లేన్ సర్వీసును నిలిపివేసింది స్పైస్‌జెట్. మరమ్మతుల కోసం ఈ చర్యలు చేపట్టినట్టు వివరించింది.
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న గుజరాత్లో ఈ సీప్లేన్ సర్వీసును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సబర్మతి నదీ తీరం నుంచి ఐక్యతా విగ్రహం వరకు ఈ సీప్లేన్‌ను నడుపుతారు.