తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్​' కిడ్నాప్​ కేసులో ముగ్గురు సస్పెండ్​ - Unnav rape victim nephew

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి మేనల్లుడు కనిపించకుండా పోయిన ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్​ చేశారు ఉన్నతాధికారులు. బాధిత కుటుంబాన్ని కలిసి వారి వాంగ్మూలం తీసుకున్న క్రమంలో ఈ మేరకు చర్యలు చేపట్టారు. బాలుడి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు.

rape victim's nephew goes missing
పోలీసు అధికారుల సస్పెండ్​

By

Published : Oct 5, 2020, 12:23 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి మేనల్లుడు (8) కనిపించకుండా పోయిన ఘటనలో చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. బాధితురాలి కుటుంబానికి భద్రతగా ఏర్పాటు చేసిన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్​ చేశారు.

లఖ్​నవూ రేంజ్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ లక్ష్మీసింగ్​.. శనివారం బాధితురాలి కుటుంబాన్ని కలిసి విచారించారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ మేరకు గన్​మెన్​ నరేంద్ర కుమార్​, కానిస్టేబుల్​ రాజేశ్​ కుమార్​, మహిళా కానిస్టేబుల్​ అనుజ్​లను సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

" ముగ్గరు పోలీసు సిబ్బంది సస్పెండ్​ అయ్యారు. దాంతో పాటు బిహార్​ పోలీస్​ స్టేషన్​లో సెక్షన్​ 364 కింద కేసు నమోదైంది. తప్పిపోయిన చిన్నారి కోసం బిహార్​, బరసాగ్వార్​, పుర్వా, మౌరావాన్​, బిఘాపుర్​ పోలీస్​ స్టేషన్లకు చెందిన బృందాలు గాలింపు చేపట్టాయి. త్వరలోనే బాలుడిని గుర్తిస్తాం. "

- ఆనంద్​ కులకర్ణి, ఉన్నావ్​ ఎస్పీ

నిందితుల కుటుంబీకులపై ఫిర్యాదు..

రెండు రోజులుగా బాధితురాలి మేనల్లుడు కనిపించటం లేదని.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబీకులే అపహరించారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు కెప్టెన్​ బాజ్​పాయ్​, సరోజ్​ త్రివేది, అనితా, సుందర లోథ్​, హర్షిత్​ బాజ్​పాయ్​లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

2019, డిసెంబర్​ 5న తన న్యాయవాదిని కలిసేందుకు వెళుతున్న క్రమంలో అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టారు దుండగులు. దిల్లీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజున ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదీ చూడండి: ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి బంధువు కిడ్నాప్​!

ABOUT THE AUTHOR

...view details