తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏనుగు మృతి కేసులో ముగ్గురు అరెస్టు

కేరళ కొల్లం జిల్లాలో ఏనుగు మృతికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేశారు ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు. పాలక్కాడ్ గర్భవతి ఏనుగు మృతి బాధ్యుల కోసం వెతుకుతుండగా వీరు తమకు చిక్కినట్లు చెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరు, గర్భవతి ఏనుగు మృతికి కారణమైన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

elephant
ఏనుగు మృతి కేసులో ముగ్గురు అరెస్టు

By

Published : Jun 11, 2020, 9:07 AM IST

కేరళ కొల్లం జిల్లాలో పండ్లలో బాంబుపెట్టి ఏనుగు మృతికి కారణమైన ముగ్గురిని ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాలక్కాడ్ ఏనుగు మృతికి కారణమైన నిందితుల కోసం వెతుకుతుండగా కొల్లం ఘటన అనుమానితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

ఈ రెండు ఏనుగులు ఒకే తరహాలో బాంబు పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మృతి చెందాయి. వాటి నోళ్లలో గాయాలు అయిన కారణంగా పలు రోజుల పాటు ఆహారాన్ని తినలేకపోయాయి.

"కొల్లం జిల్లా పతన్​పురంలో ఏనుగు మృతికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేశాం. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి."

-అటవీ శాఖ అధికారి, కొల్లం

అయితే నిందితుల లక్ష్యం ఏనుగు కాదని.. అడవి పందులు, జింకల కోసం ఈ బాంబులు పెట్టిన ఆహారం ఉంచారని వెల్లడించారు అధికారులు. అయితే ఆహారాన్ని గమనించిన ఏనుగు దానిని తినేందుకు ప్రయత్నించగా నోటిలో పేలినట్లు పేర్కొన్నారు. బాంబు పేలుడుతో ఏనుగు దవడకు గాయమైందని.. ఈ కారణంగా ఆహారం తినలేక ఆకలితో చనిపోయిందని చెప్పారు.

గర్భవతి ఏనుగు మృతి నిందితుల కోసం గాలింపు..

పాలక్కాడ్​ జిల్లాలో ఏనుగు మృతికి కారణమైన ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు అధికారులు. ఏప్రిల్ 5న ఒకరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: సరిహద్దు నుంచి వెనక్కిమళ్లని చైనా బలగాలు!

ABOUT THE AUTHOR

...view details