జమ్ముకశ్మీర్లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ 2జీ మొబైల్ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన 301 వెబ్సైట్లను మాత్రమే వినియోగించేందుకు వీలుంటుందని జమ్ముకశ్మీర్ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ వ్యాలీ వాసులకు మరికొద్దిరోజులు సామాజిక మాధ్యమాలను దూరంగా ఉంచుతున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం ఆమోదించిన సైట్లలో బ్యాంకింగ్, వార్తా, ప్రయాణం, మౌలిక సదుపాయాలు, ఉపాధికి సంబంధించిన సైట్లు ఉన్నాయి.