తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లోని ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవలను పునరుద్ధరించింది కేంద్రం. స్థానికులు 2జీ ఇంటర్నెట్​ను వినియోగించుకుంటున్నారు. క్రమక్రమంగా మరిన్ని ప్రాంతాల్లో అంతర్జాల సేవలు పునరుద్ధరించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

By

Published : Aug 17, 2019, 10:26 AM IST

Updated : Sep 27, 2019, 6:39 AM IST

కశ్మీర్​: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ

జమ్ముకశ్మీర్​లో క్రమక్రమంగా ఆంక్షల్ని ఎత్తివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుకున్నాయి. సమాచార వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. తాజాగా ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించింది కేంద్రం. ఐదు జిల్లాల్లో(జమ్ము, రియాసీ, సాంబా, కథువా, ఉధమ్​పూర్​) 2జీ అంతర్జాల సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్​ 370 రద్దుకు ముందు ఆగస్టు 5న రాష్ట్రంలో ఇంటర్నెట్​ సేవలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థను వినియోగించి ఉగ్రవాద సంస్థలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో క్రమక్రమంగా సేవలను పునరుద్ధరించడానికి నిర్ణయించారు.

17 ఎక్స్చేంజీల్లో ...

17 ఎక్స్చేంజీల్లో ల్యాండ్​లైన్​ సర్వీసులను శనివారం పునరుద్ధరించారు.​ కంటోన్మెంట్​, శ్రీనగర్​ విమానాశ్రయం, సివిల్​ లైన్స్​ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.

రాష్ట్రంలో 100కు పైగా ల్యాండ్​లైన్​ఎక్స్చేంజీలు ఉన్నాయి. వీటిని క్రమక్రమంగా పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సెంట్రల్​ కశ్మీర్​లోని బడ్గాం​, సోనమార్గ్​, మనిగామ్​.. ఉత్తర కశ్మీర్​లోని గురెజ్​, తంగ్​మార్గ్​ ప్రాంతాల్లో ల్యాండ్​లైన్​ సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.

దక్షిణ కశ్మీర్​లోని కాజీగుండ్​​, పహల్గామ్​ ప్రాంతాల్లోనూ సేవలను పునరుద్ధరించారు.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 27, 2019, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details