దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెెలిపారు. టీకా సరఫరా చేసేందుకు ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ కోల్డ్ చైన్‌లను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు చెప్పారు.
వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో 29వేల కోల్డ్ చైన్ పాయింట్స్, 240 వాక్ఇన్ కూలర్స్, 70 వాక్ఇన్ ఫ్రీజర్స్ ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 45వేల ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్స్, 41 వేల డీప్ రిఫ్రిజిరేటర్స్, 300 సౌర రిఫ్రిజిరేటర్స్‌ను వినియోగించనున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సందర్భంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు.