తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో కేంద్ర మంత్రి - corona virus latest news

భారత్​లో ఇప్పటి వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు రాజ్యసభలో తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్. విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరొనా ప్రభావిత దేశాలకు వీసా రద్దు చేసినట్లు వెల్లడించారు.

29-corona-cases-in-india
భారత్​లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో ఆరోగ్యమంత్రి

By

Published : Mar 5, 2020, 12:15 PM IST

Updated : Mar 5, 2020, 7:47 PM IST

భారత్​లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో కేంద్ర మంత్రి

దేశంలో మార్చి 4 వరకు 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ రాజ్యసభలో ప్రకటించారు. దిల్లీ, ఆగ్రా, తెలంగాణ, రాజస్థాన్‌లో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనా నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో వైద్యపరీక్షలు చేస్తున్నామన్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి భారతీయులను వెనక్కిరప్పిస్తున్నామని, విదేశీయులను అప్రమత్తం చేస్తున్నామని స్పష్టం చేశారు. అందరికీ వైద్య పరీక్షలు చేయించి.. నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.

''జపాన్‌, దక్షిణ కొరియా, ఇతర దేశాలకు వీసాలు రద్దు చేశాం. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించాం. యూపీ, ఉత్తరాఖండ్‌, సిక్కిం, బిహార్‌ సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. కరోనా నియంత్రణకు విస్తృత ప్రచారం చేస్తున్నాం. దేశ సరిహద్దుల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. పత్రికలు, రేడియో, టెలివిజన్‌, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాం. నగరాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. కరోనా దృష్ట్యా ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. మంత్రుల బృందం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.''

-రాజ్యసభలో హర్షవర్దన్, కేంద్ర ఆరోగ్య మంత్రి

ఇదీ చూడండి: కరోనాకు భయపడొద్దంటూ సైకత శిల్పంతో సందేశం

Last Updated : Mar 5, 2020, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details