తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా అసెంబ్లీ స్పీకర్​ పదవిపై కాంగ్రెస్​ గురి! - maharastra assembly speaker election date

మహారాష్ట్ర శాసనసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా రేపు ఉద్ధవ్ ​ఠాక్రే ప్రమాణం చేయనున్నారు. నూతన స్పీకర్ ఎన్నికపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నవంబర్ 30న స్పీకర్ ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్​ చెబుతోంది.

285 members take oath at Maha Assembly's special session
మహా అసెంబ్లీ స్పీకర్​ పదవిపై కాంగ్రెస్​ గురి!

By

Published : Nov 27, 2019, 3:12 PM IST

మహారాష్ట్ర ఎమ్మెల్యేలుగా 285 మంది ప్రమాణస్వీకారం చేశారు. 14వ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రొటెం స్పీకర్​ కాళిదాస్​ కొలంబ్కర్​ ... కొత్తగా ఎన్నికైనవారితో ప్రమాణం చేయించారు. అనంతరం సభను వాయిదా వేశారు.

మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యుల్లో సుధీర్​ ముంగంటివార్​ (భాజపా), దేవేంద్ర భూయార్​ (స్వాభిమాన్​ పక్ష్​) మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు.

అజిత్​కు మద్దతుగా...

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమైన అజిత్​ పవార్​.. ప్రమాణస్వీకారం చేయడానికి లేచినప్పుడు ఎన్​సీపీ సభ్యులు బల్లలు చరుస్తూ ఆయనకు మద్దతు తెలిపారు.

ఆదిత్య ఠాక్రే..

ఠాక్రే వంశం నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన శివసేన యువకెరటం ఆదిత్య ఠాక్రే.. సభలోని సీనియర్ నాయకుల వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు. మొదటిసారి శాసనసభకు ఎన్నికైన ధీరజ్​ దేశ్​ముఖ్​ (కాంగ్రెస్​), రోహిత్ పవార్​ (ఎన్​సీపీ) కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నూతన స్పీకర్ ఎన్నిక ఎప్పుడు?

"శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆ తరువాతే నూతన స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయిస్తారు."
- కాళిదాస్ కొలంబ్కర్​, ప్రొటెం స్పీకర్​

అయితే నూతన స్పీకర్ ఎన్నికల నవంబర్ 30న జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పదవి కంటే స్పీకర్​ పదవి వైపే కాంగ్రెస్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:హిమాచల ప్రదేశం... శ్వేతవర్ణ శోభితం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details