తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి చేసుకోమన్నందుకే.. కుటుంబాన్ని హతమార్చాడు!

వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు.. ఓ వ్యక్తి ఐదుగురు కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకన్నాడు. ఈ విషాద ఘటన పంజాబ్​లోని మోగా జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబాన్ని హతమార్చిన యువకుడు నపుంసకుడిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది.

పెళ్లి చేసుకోమన్నందుకే.. కుటుంబాన్ని హతమార్చాడు!

By

Published : Aug 3, 2019, 3:41 PM IST

Updated : Aug 3, 2019, 5:37 PM IST

పెళ్లి చేసుకోమన్నందుకే.. కుటుంబాన్ని హతమార్చాడు!

వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన తన కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు ఓ యువకుడు. ఇంట్లో ఉన్న ఆరుగురిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల్లోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన పంజాబ్​లోని మోగా జిల్లా నథువాలా గార్బి గ్రామంలో జరిగింది.

మృతుల్లో అతని తల్లి బిందెర్​ కౌర్​ (50), తండ్రి మంజీత్​ సింగ్​ (55), చెల్లెలు అమంజోత్​ కౌర్​ (33), నానమ్మ గుర్దీప్​ కౌర్​ (70), మేనకోడలు మనీత్​ కౌర్​ (3) ఉన్నారు. అతని తాత తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.

నిరుద్యోగి..

ఈ దురాగతానికి ఒడిగట్టేందుకు అతను తుపాకీని తమ బంధువుల నుంచి దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు పాల్పడిన వ్యక్తి ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ క్రమంలో డిసెంబర్​లో అతని వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకు అంగీకరించని ఆ వ్యక్తి కుటుంబసభ్యులతో తరచూ గొడవలకు దిగేవాడు. తాజాగా ఇదే అంశంలో తగాదా పెరిగి.. హత్య చేసుంటాడని భావిస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: భార్యను పందెం కట్టి- ఆపై అత్యాచారానికి ఉసిగొల్పి!

Last Updated : Aug 3, 2019, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details