తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లక్షణాలు లేకున్నా.. 28శాతం మందికి కరోనా - icmr latest news

ఏప్రిల్​ 30 వరకు భారత్​లో నమోదైన కరోనా కేసుల్లో 28శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని ఐసీఎంఆర్​ తాజా అధ్యయనంలో తేలింది. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

28% of  COVID-19 cases in India till April 30 are asymptomatic: Study
లక్షణాలు లేకున్న 28శాతం మందికి కరోనా!

By

Published : May 30, 2020, 7:39 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైన విషయాలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. జనవరి 22 నుంచి ఏప్రిల్ 30 మధ్యకాలంలో 40వేల 184 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా.. వారిలో 28 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని ఐసీఎంఆర్​ పరిశోధనలో వెల్లడైంది. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలే కన్పించని వారి నుంచి వైరస్​ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొత్తం కేసుల్లో 5.2 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలవేనని ఐసీఎంఆర్​ వివరించింది. ఈమేరకు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్​ రీసెర్చ్​(ఐజేఎంఆర్)లో ఐసీఎంఆర్​ అధ్యయనం ప్రచురితమైంది. వైరస్​ లక్షణాలు కన్పించని 28.1శాతం కేసులలో 25.3 శాతం మందికి ఇతర రోగులతో సన్నిహితం ఉండటం వల్లే కరోనా సోకిందని పరిశోధన పేర్కొంది. మిగతా 2.8 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలని, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్ బారిన పడినట్లు తెలిపింది.

లక్షణాలు లేని వారి నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం ఎక్కువగానే ఉంటుందని, ఇది ఆందోళన కల్గించే అంశమని ఐసీఎంఆర్ నేషనర్ ఇనిస్టిట్యాట్​ ఆఫ్ ఎపిడమియాలజీ డైరెక్టర్ మనోజ్ ముర్హేకర్ తెలిపారు.

అధ్యయనంలోని పలు కీలక విషయాలు..

  • జనవరి 22నుంచి ఏప్రిల్​ 30 మధ్యకాలంలో 10,21,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
  • మార్చి మొదట్లో రోజుకు 250మందికే పరీక్షలు చేయగా.. ఏప్రిల్ చివరి నాటికి ఆ సామర్థ్యం 50వేలకు పెరిగింది.
  • వైరస్ బారిన పడ్డవారిలో 50 నుంచి 69ఏళ్ల మధ్య వయస్కుల వారే అధికం. మొత్తం కేసుల్లో వీరే 63.3శాతం మంది ఉన్నారు. 10 ఏళ్ల లోపు చిన్నారుల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. వారి శాతం 6.1 మాత్రమే.
  • వైరస్ సోకిన వారిలో పురుషులే అధికం. వారిలో 41.6 శాతం మందికి పాజిటివ్​గా తేలగా.. మహిళల్లో మాత్రం 24.3శాతం మందే వైరస్ బారినపడ్డారు.
  • దేశంలోని 523 జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి.
  • ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర(10.6శాతం) తొలిస్థానంలో ఉంది.
  • ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ(7.8శాతం), గుజరాత్​(6.3శాతం), మధ్యప్రదేశ్​(6.1శాతం) ఉన్నాయి.
  • కరోనా బారిన పడ్డవారిలో జ్వరం, దగ్గు లక్షణాలు సాధారణం. 5 శాతం కంటే తక్కువ మందిలో కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు బయటపడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details