ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది నక్సల్స్ పోలీసులకు లొంగిపోయారు. దంతెవాడలోని చిక్పాల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నూతన పోలీసు క్యాంపులో వీరు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరిపై రూ.2 లక్షలు, ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్: లొంగిపోయిన 28 మంది నక్సలైట్లు - 28 Naxals, including four with bounty on their heads
28 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయిన ఘటన ఛత్తీస్‌గఢ్ దంతెవాడలోని చిక్పాల్లో జరిగింది. వీరిలో ఒకరిపై రూ.2 లక్షలు, ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ ఉంది.. తక్షణ ప్రోత్సాహకం కింద వీరికి రూ.10 వేలు చొప్పున్న అందిస్తున్నామని, తరువాత పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్: పోలీసులకు లొంగిపోయిన 28 మంది నక్సల్సైట్లు
వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులమై తప్పుచేశామని తమ స్థానిక ప్రాంతాల్లో అభివృద్ధిని చూడాలని లొంగిపోయామని వారు పోలీసులకు చెప్పారు. వీరికి రూ.10 వేలు చొప్పున తక్షణ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని, ఆ తర్వాత పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: నా రిసార్టులో ఆ కార్యక్రమం రద్దు: ట్రంప్
TAGGED:
Dantewada Naxals surrender